తమిళ సినీ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్ కుమార్ రైఫిల్ పోటీల్లో పాల్గొననున్నారు. అజిత్ కు నటనతో పాటు రేసింగ్, షూటింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. 2021 తమిళనాడు స్టేట్ రైఫిల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆయన ఆరు మెడల్స్ సాధించారు. తాజాగా 47వ తమిళనాడు రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు తిరుచ్చి చేరుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.