ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఘనవిజయం తర్వాత, ఫ్యామిలీతో కలిసి వరస వెకేషన్ల కెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే వెకేషన్లను పూర్తి చేసుకొచ్చిన బన్నీ ఆపై తన ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ మేరకు హరీష్ శంకర్ తో కలిసి థాయిలాండ్ లో ఒక యాడ్ షూట్ చేసొచ్చిన బన్నీ లేటెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరొక యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ యాడ్ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది.
ఈ యాడ్ షూట్ కి సంబంధించిన బన్నీ లుక్స్ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బన్నీ లుక్స్, స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం బన్నీ లేటెస్ట్ లుక్ తో తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే, న్యూ లుక్ లో బన్నీ షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. అంటే, పుష్ప షూటింగ్ ఇంకా ఆలస్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయం నిజమే అనిపిస్తుంది ... ఎందుకంటే, పుష్ప రోల్ కి లాంగ్ హెయిర్, గుబురు గడ్డం కావాలి. మరి బన్నీ షాట్ హెయిర్ తో కనిపిస్తున్నాడంటే పుష్ప షూటింగ్ ఇప్పుడప్పుడే మొదలవ్వదనే కదా అర్ధం..!!