కొంచెంసేపటి క్రితమే కళ్యాణ్ రామ్ "బింబిసార" రిలీజ్ ట్రైలర్ విడుదలయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా డిజిటల్ లాంచ్ ఐన ఈ ట్రైలర్ బింబిసారుడి వీరత్వాన్ని, గంభీరతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. బింబిసారుడిగా కళ్యాణ్ నటన అద్భుతం. డైలాగ్ డెలివరీ సూపర్. ఇక, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. చూస్తుంటే, ఖచ్చితంగా ఈ సారి కళ్యాణ్ రామ్ సూపర్ డూపర్ హిట్ అందుకునేలా ఉన్నాడు. చూడాలి మరి, ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకులు ఈ సినిమాకు ఎన్ని మార్కులు వేస్తారో..!
కొత్త దర్శకుడు వశిష్ట్ డైరెక్షన్లో సోషల్ ఫాంటసీ మూవీగా, టైమ్ లూప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ కే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.