టాలీవుడ్ జక్కన్న చెక్కిన అద్భుతమైన విజువల్ వండర్ "ఆర్ ఆర్ ఆర్(రౌద్రం రుధిరం రణం)". యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రంలో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, శ్రేయా శరణ్ కీలకపాత్రలు పోషించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా, డీవీవీ దానయ్య నిర్మించారు.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఎన్నో రికార్డులు బద్దలు చేసి, మరెన్నో సరికొత్త రికార్డులను సృష్టించిన ఈ సినిమా కొత్తగా మరొక అరుదైన రికార్డును నెలకొల్పింది. అదేంటంటే, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న RRR పది వారాల నుండి గ్లోబల్ ట్రెండింగ్ లిస్ట్ లో కొనసాగుతూ వస్తుంది. ఈ రికార్డు సాధించిన మొదటి నాన్ ఇంగ్లిష్ మూవీగా నెట్ ఫ్లిక్స్ చరిత్రలో RRR నిలిచిపోతుంది. ఇండియన్ సినిమాకు దక్కిన అరుదైన గౌరవమిది.