పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "భీమ్లానాయక్" తో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఆ సినిమాలో సంయుక్త పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆమెకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ఒక్క సినిమాతో తెలుగులో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందంటే నమ్మశక్యంగా లేదు కదా.
డైరెక్ట్ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా, ఇది కాకుండా పృథ్విరాజ్ "కడువా" లో కూడా నటించిన సంయుక్త కళ్యాణ్ రామ్ "బింబిసార" లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతున్న బింబిసార ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సంయుక్త చక్కని తెలుగు మాట్లాడడం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కరోనా పాండెమిక్ టైం లో తెలుగు ట్యూటర్ ను పెట్టుకుని చక్కని తెలుగు నేర్చుకుందట. తెలుగు సినిమాలు చేస్తుంది కాబట్టి భాష పూర్తిగా అర్ధమైతేనే బాగా నటించగలమని, అందుకే కష్టమైనా తెలుగు నేర్చుకుందట.
ధనుష్ "సార్", సాయి ధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది.