"లైగర్" టీం నుండి కొంచెంసేపటి క్రితమే స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. లైగర్ వాట్ లగా దేంగే పేరుతో చిన్న వీడియో గ్లిమ్స్ ను జూలై 29వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలిపారు. లైగర్ నుండి అప్డేట్స్ కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్న అభిమానులకు నిజంగా ఇదొక గుడ్ న్యూస్.
పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే జంటగా నటించిన ఈ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు.