ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామారావు ఆన్ డ్యూటీకి సెన్సార్ పూర్తి

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 06:53 PM

రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రామారావు ఆన్ డ్యూటీ" సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించగా, దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 29న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇక, ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఖిలాడీ తో డిజప్పాయింట్ ఐన అభిమానులను ఈ సినిమాతో మెప్పించాలనుకుంటున్నాడు రవితేజ. మరి ఈ సినిమాకు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com