ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారక్ ని కళ్యాణ్ రామ్ ఎలా పిలుస్తాడో తెలుసా..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 07:03 PM

కళ్యాణ్ రామ్ నటించిన "బింబిసార" రిలీజ్ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొంచెంసేపటి క్రితమే డిజిటల్ గా లాంచ్ చేసారు. బింబిసార నుండి విడుదలైన ఈ సెకండ్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ట్రైలర్ ను లాంచ్ చేసినందుకు తారక్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ లో తారక్ ను కళ్యాణ్ "నాన్నా" అని పిలవడం విశేషం. ఈ ట్వీట్ నందమూరి అన్నదమ్ముల మధ్య ఎంతటి సఖ్యత ఉందో క్లియర్ గా తెలుపుతుంది. ఈ ట్వీట్ అభిమానుల హృదయాలను దోచుకుంటుంది. ఇకపోతే, ఈ నెల 29న జరగబోయే బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా తారక్ చీఫ్ గెస్ట్ గా హాజరై, అన్న కళ్యాణ్ రామ్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వనున్నాడు.
వశిష్ట్ డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రం సోసియో ఫాంటసీ మూవీగా తెరకెక్కింది. ఇందులో క్యాథెరిన్ ట్రెస్సా , సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com