మెగాస్టార్ చిరంజీవి 151వ మూవీ సైరా. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్ చరణ్ నిర్మాత. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఇక జార్జియాకు పక్క దేశమైన అజర్ బైజాన్ లో రామ్ చరణ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. బోయపాటి దర్శకత్వంలో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాల అక్కడ చిత్రీకరిస్తున్నారు..ఈ మూవీకి డి వి వి దానయ్య నిర్మాత. ‘సైరా’లో చిరంజీవి పోర్షన్ కి సంబంధించిన షూటింగుకి కాస్త విరామం దొరకడంతో, వెంటనే ఆయన చరణ్ షూటింగు జరుగుతోన్న అజర్ బైజాన్ కు వెళ్లారు… చరణ్ షూటింగ్ స్పాట్ కి చిరు వెళ్లి చిత్ర యూనిట్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.. ఆ స్పాట్ లో ఉన్న తన కుమారుడు రామ్ చరణ్, కొడలు ఉపాసన తో కలిసి చిరంజీవి ఒక ఫోటో దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa