ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబాయ్, తమ్ముళ్ల సక్సెస్ మంత్ర... కళ్యాణ్ రామ్ కి వర్కౌట్ అవుతుందా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 05:35 PM

నందమూరి బాలకృష్ణ నటించి, గతేడాది విడుదలైన చిత్రం "అఖండ". కరోనా సెకండ్ వేవ్ తరవాత విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR ఈ ఏడాది మొదట్లో విడుదలై పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు చిత్రాల కధలను ఒకసారి పరిశీలిస్తే, ఒక పోలిక ఉందని తెలుస్తుంది. అదేంటంటే, ఈ రెండు సినిమాలలో చైల్డ్ సెంటిమెంట్ ఉంటుంది. ఈ చైల్డ్ సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. వారి నుండి విశేష స్పందన కూడా వచ్చింది.
లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం "బింబిసార". ఇందులో కూడా చైల్డ్ సెంటిమెంట్ ఉంటుందని తెలుస్తుంది. ట్రైలర్ ను మరొక్కసారి చూస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది. బాబాయ్, తమ్ముడికి బ్లాక్ బస్టర్ హిట్లనిచ్చిన ఈ సక్సెస్ మంత్ర కళ్యాణ్ రామ్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. కొత్త దర్శకుడు వశిష్ట్ డైరెక్ట్ చేసిన ఈ సోసియో ఫాంటసీ మూవీ ఆగస్టు 5న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa