కొత్త దర్శకుడు వశిష్ట్ డైరెక్షన్లో సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన చిత్రం "బింబిసార". ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా బింబిసార టీం తిరుపతిలో సందడి చేసారు. తిరుపతి చేరుకున్న కళ్యాణ్ రామ్, శ్రీనివాస రెడ్డి, చోటా కే నాయుడు ముందుగా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.