చందు మొండేటి డైరెక్షన్లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి మేకర్స్ లేటెస్ట్ గా మేజర్ అప్డేట్ ఇచ్చారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాక మిగిలిన భాషల్లో కూడా కార్తికేయ ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఆగస్టు 6వ తేదీన కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.