ముంబై భామ వేదిక దక్షిణాదిన అన్ని భాషలో నటిస్తూ బిజీగా గడు పుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం వెకేషన్ లో చిల్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ పింక్ బికినీలో వయ్యారంగా నడుస్తున్న ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. విజయద శమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాణం, దగ్గరగా దూరంగా, రూలర్ సినిమాల్లో నటించింది. కాంచన 3 లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో జింగిల్ ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ఒకటి.