కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, స్టార్ హీరో విక్రమ్ తో కలిసి చేసిన సినిమా "ధృవనక్షత్రం". షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి చాన్నాళ్ల బట్టి ఎలాంటి న్యూస్ లేదు. ఈ సినిమా అప్డేట్ల కోసం ప్రేక్షకులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా లైం లైట్ లో కొచ్చింది. ఈ మధ్య ఆరోగ్యం బాగోక ఆసుపత్రి పాలైన విక్రమ్ ను డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ కలిసి పరామర్శించారు. అలానే ధృవనక్షత్రం మూవీ పై కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. సో, త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఒక అవగాహన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.