అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏజెంట్'. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయినిగా నటించింది. ఈ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేస్తామని ఏజెంట్ మేకర్స్ ప్రకటించారు. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతోంది. దీంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ వరకు లేదంటే అక్టోబర్‌లో అయినా ముగించి. సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనే చిత్రబృందం చూస్తుంది. ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.