సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు బాబూరాజ్ వాజ్‌పల్లి (59) కన్నుమూశారు. ఛాతిలో నొప్పి రావడంతో బాబూరాజ్‌ను కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాబురాజ్ హఠాన్మరణం మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు మాలీవుడ్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa