అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "లాల్ సింగ్ చద్దా" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా 1994లో రిలీజ్ అయినా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఫారెస్ట్ గంప్" హిందీ రీమేక్. ఈ సినిమాలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2022 ఆగస్టు 12న విడుదల కానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 44 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ కూడా పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.