"లైగర్" నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ కూడా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మూడవ లిరికల్ సాంగ్ అప్డేట్ ను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే ఎనౌన్స్ చేసారు. "ఆఫత్" అని సాగే ఈ పాట ప్రోమోను రేపు సాయంత్రం నాలుగింటికి, పూర్తి పాటను ఆగస్టు 5వ తేదీ ఉదయం తొమ్మిదింటికి విడుదల చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేసారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాతో పాన్ ఇండియా బరిలోకి అడుగు పెడుతున్నారు. అలానే హీరో విజయ్ దేవరకొండ కూడా. కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఆగష్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa