బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ఓ వైపు సినిమాలతో బిజీగా గడుపు తూనే.. మరోవైపు సోషల్ మీడియా లోనూ తన మార్క్ చాటుకుంటోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ తో ఆకట్టుకుంటోంది. టీవీ షో, స్పెషల్ ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రొమాన్స్ చేయాలని ఉందని చెప్పిన ముద్దుగుమ్మ.. ఆ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అయితే ఇంకా బాగుంటుందని చెప్పు
కొచ్చింది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించనున్న సినిమా కోసం మొదట జాన్వీ పేరే వినిపిం చింది. ఆ తర్వాత అలియా భట్ ను ఖరారు చేసింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో సినిమా నుంచి తప్పుకుంది. మరీ.. ఆమె స్థానంలో జాన్వీని తీసుకుంటా రేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa