హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన చిత్రం "సీతారామం". వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సీతారామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 860పై చిలుకు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. నైజాం - 115, సీడెడ్ - 50, ఆంధ్ర - 185, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - 80, ఇతర భాషలు - 180, ఓవర్సీస్ - 250 ... మొత్తంగా 860+ థియేటర్లలో రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa