సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ గతేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కన్నా ఈ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ ఐన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతానికైతే, బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్ పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం, పుష్ప 2 డిజిటల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే ఆ మూవీ మేకర్స్ తో సంప్రదింపులు జరుపుతుందట. పుష్ప మొదటి భాగం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా, ఇప్పుడు సీక్వెల్ కోసం నెట్ ఫ్లిక్స్ రంగంలోకి దిగడం విశేషం. మరి ఈ రెండు సంస్థల్లో ఏది పుష్ప సీక్వెల్ హక్కులను సొంతం చేసుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa