నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించిన ఈ మూవీలో క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బింబిసార మూవీ ప్రపంచవ్యాప్తంగా 975 పై చిలుకు థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. నైజాం - 232, సీడెడ్ - 130, ఆంధ్ర - 320, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా - 80, ఓవర్సీస్ - 210 ... మొత్తంగా 975 థియేటర్లలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. 16. 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రేపు థియేటర్లలో విడుదల కాబోతుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa