సీనియర్ హీరోయిన్లు, 80,90లలో స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీ ని ఏలిన ఖుష్బూ, రంభ చాన్నాళ్ల తరవాత కలుసుకున్నట్టు తెలుస్తుంది. చెన్నైలో ఉంటున్న రంభ సొంతింటికి ఖుష్బూ తన కూతుళ్లతో కలిసి వెళ్ళింది. అక్కడ అందరు బిర్యానీ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి రోజులను, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయాలను మాట్లాడుకున్నామని ఖుష్బూ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ పెట్టింది. ఈ పిక్స్ లో రంభను చూస్తుంటే, ఇప్పటి హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోనట్టు ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa