నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తొలి హిస్టారికల్ ఎంటర్టైనర్ "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఇందులో క్యాథెరిన్ థెరెస్సా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తుండగా, పాటలను చిరంతన్ భట్ కంపోజ్ చేసారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఆగస్టు 5న విడుదల కాబోయే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను ఆగస్టు 18వ తేదీన ఎనౌన్స్ చేస్తామని కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పారు. రేపు విడుదల కాబోయే ఈ సినిమా పట్ల తెలుగు ఆడియన్స్ స్పందన బట్టి మిగిలిన భాషల్లో విడుదల చేసే విషయాన్ని ఆగస్టు 18న ఎనౌన్స్ చేస్తామని చెప్పారు.