ట్రెండింగ్
Epaper    English    தமிழ்

500 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసిన 'మాచర్ల నియోజకవర్గం' లోని మాస్ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 05, 2022, 02:41 PM

MS రాజశేఖర్ రెడ్డి  దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 12, 2022న విడుదల కానుంది. 'రా రా రెడ్డి... ఐయామ్ రెడీ' అనే టైటిల్ తో రూపొందిన మాస్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో 500 మిలియన్ల వీక్షణలను క్రాస్ చేసినట్లు సమాచారం. లిప్సిక ఈ ఎనర్జిటిక్ సాంగ్ ని పాడగా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa