ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 04, 2018, 04:35 PM

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌లో సరైన అవకాశాలు రావడం లేదనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఇతర భాషలకు చెందిన వారే నాయికలుగా రాణిస్తున్నారు. వారే స్టార్‌డమ్‌ సొంతం చేసుకుంటున్నారు. సినిమాల్లో నటించేందుకు తెలుగు అమ్మాయిలు ముందుకురావడం లేదని చిత్ర సంబంధికులు అంటున్నారు. కారణాలు ఏవైనా తెలుగు అమ్మాయిలకు సరైన స్థానం లేదనేది వాస్తవం.


తెలుగు నటి ఈషా రెబ్బ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్‌. నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా అరవింద సమేత..లో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. తాజాగా కన్నడలో నటించే అవకాశం వచ్చిందట. కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ సరసన నటించనుంది తెలిసింది. లక్కీ గోపాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా కన్నడంలో పరిచయం అవుతున్న ఈషకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె సన్నిహితులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa