అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ’గా నిలిచింది బాలీవుడ్ టి ఇలియాన. ఇప్పటి వరకు ఇండియన్ సైబర్ స్పేస్‌లో ఈ జాబితాలో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్థానంలో ఇలియానా నిలిచింది. అమెరికన్ గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎమ్‌సిఎఎఫ్ ఇ ఇ నిర్వహించిన ‘అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ’ సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్లను మభ్యపెట్టి తప్పుడు వెబ్‌సైట్లు క్లిక్ చేసేందుకు ఇలియానా పేరును ఎక్కువగా ఉపయోగించారని తేలింది. ఈ జాబితాలో ఆమె తర్వాత ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ప్రీతీ జింతా, టబు, కృతి సనన్, అక్షయ్ కుమార్, రిషి కపూర్, పరిణీతి చోప్రా, గోవింద ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa