తమిళ హీరో విజయ్ సేతుపతి, సీనియర్ నటి త్రిష జంటగా నటించిన మూవీ 96. దాదాపు రెండేళ్లు విరామం తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన చిత్రం ఇది.. ఈ మూవీ ఈరోజు తమిళనాడులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఏకంగా రివ్యూలలో ఈ మూవీకి 4 స్టార్ లు కట్టబెట్టారు..ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి తమిళ యూత్ నీరాజనాలు పడుతోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటని అంటున్నారు. కాగా ఈ మూవీ విడుదలకు ముందే ఈ మూవీని చూసిన నిర్మాత దిల్ రాజు తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. నానీ హీరోగా ఈ మూవీని నిర్మించే ఆలోచనలో ఉన్నాడు..కాగా, 96 మూవీ ఒక సింపుల్ ప్రేమ కథ..చిన్న తనం లో ప్రేమించుకున్న ఒక జంట 35 ఏళ్ల వయసులో కలుసుకుంటే ఏం జరిగిందనే విషయాన్ని దర్శకుడు ప్రేమకుమార్ చక్కగా తెరపైకి ఎక్కించాడని క్రిటిక్ సైతం ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa