కన్నడ భామ రష్మిక మందన్న జోరు టాలీవుడ్ లో కొనసాగుతున్నది..చలో, గీత గోవిందం, దేవదాస్ మూవీల విజయంతో ఆమెకు టాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది.. దీంతో నిర్మాత, దర్శకులు ఆమె వెంటపడుతున్నారు.. అయితే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తానని తేల్చి చెబుతుంది రష్మిక.. ఏదో హీరోయిన్ గా ఉన్నాననే పాత్రలను చేసేది లేదని పేర్కొంది.. మంచి పాత్రలు ఉన్న మూవీలో కొన్ని చేసినా చాలని, అదే తృప్తి ఇస్తుందని నిర్మాత, దర్శకులకు చెబుతున్నది..’నటనకు అవకాశం లేని పాత్రలను, కథలో ప్రాధాన్యం లేని పాత్రలను ఒప్పుకోను, కథలో నా పాత్రకు తగిన గుర్తింపు వుండాలి. అలాంటి సినిమాలే చేస్తాను. ఆ మూవీలలో హీరో ఎవరనే విషయం పట్టించుకోబోనని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది రష్మిక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa