తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. తమిళంలో ఆమె చేసిన రెండు సినిమాలలో ఒకటి దసరాకి విడుదలవుతుంటే, మరొకటి దీపావళికి విడుదలవుతుండటం విశేషం. విశాల్ సరసన నాయికగా ఆమె చేసిన 'పందెం కోడి 2'ని దసరా కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు.ఇక విజయ్ జోడీగా ఆమె 'సర్కార్' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. విజయ్ .. విశాల్ ఇద్దరూ మాస్ హీరోలు కావడం, ఈ ఇద్దరి సినిమాలు పెద్ద పండుగలకు విడుదలవుతూ ఉండటం తన కెరియర్ కి బాగా కలిసొస్తుందని కీర్తి సురేశ్ భావిస్తోంది. ఆమె ఆశిస్తున్నట్టుగా జరుగుతుందేమో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa