హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్టు...ఇలా చేతికందొచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుంటూ, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తిరుగులేని స్థానం సంపాదించిన హీరో ఆది పినిశెట్టి. హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆది. వీరి వివాహం మే లో, చెన్నైలో అట్టహాసంగా జరిగింది. వీరి వివాహానికి టాలీవుడ్ యువహీరోలు నాచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్, నీరజ కోన తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ గా వీరి పెళ్లి వీడియోకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ఈ టీజర్ చూస్తూనే తెలుస్తుంది. 2015లో వచ్చిన మలుపు సినిమాలో ఆది, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. ఇంకా వీరిద్దరూ కొన్ని తమిళ సినిమాలలో కలిసి నటించారు.