ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"NMBK" : 'నచ్చావ్ అబ్బాయ్' సాంగ్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 12:30 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "నేను మీకు బాగా కావాల్సిన వాడిని". ఈ చిత్రంతో కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి కొంచెంసేపటి క్రితమే సెకండ్ లిరికల్ సాంగ్ "నచ్చావ్ అబ్బాయ్" ప్రోమో రిలీజ్ అయ్యింది. పెప్పి మ్యూజిక్ తో, కలర్ ఫుల్ సెట్టింగ్స్ తో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com