సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మికి రహస్య నిశ్చితార్థం జరిగిందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. ‘సర్కార్’, ‘సండైకోళి2’, ‘మారి2’, ‘నీయా2’, ‘వెల్వెట్ నగరం’, ‘రాజపార్వై’ తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న వరలక్ష్మి గురించిన ఈ వార్త అభిమానులకు కూడా షాకిచ్చింది. అయితే రహస్య నిశ్చితార్థం వార్తలను వరలక్ష్మి వదంతులుగా కొట్టిపారేసింది.
ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి వార్తలను ఎలా ప్రచారం చేస్తారో తెలియడం లేదని, నటిగా ఎదుగుతున్న తనను అడ్డుకునేందుకు ఇటువంటి వదంతులు పుట్టిస్తున్నారని వరూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాపైనే ఉందని, పెళ్లి చేసుకునేముందు తానే ప్రకటిస్తానని వరలక్ష్మి చెప్పింది. ఇదిలా ఉండగా, వరలక్ష్మి నటించిన ‘సర్కార్’, ‘సండైకోళి2’ చిత్రాలు తెలుగులోను విడుదల కాబోతున్నాయి. తెలుగులో వరలక్ష్మి సొంతంగా డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa