నటిగా కొనసాగడం విసుగెత్తిందని గతంలో చెప్పుకుంది శృతి హాసన్. తీరిక లేకుండా నటించడం వల్ల జీవితాన్ని తెలుసుకోలేక పోతున్నానని, ఇష్టమైన పనులకు దూరమవుతున్నానని బాధపడింది. సంగీతం తనకిష్టమైన రంగమని, గాయనిగా స్థిరపడాలని అనుకుంటున్నట్లు ఆమె చెబుతూ వస్తోంది. ఈ ఏడాదిలోనే గాయనిగా నన్ను చూస్తారని చెప్పిన శృతి అన్నంత పనీ చేసేసేంది. స్వరకర్త ఉద్యాన్ సాగర్‌తో కలిసి ఓ ఆల్బమ్ చేయబోతోందీ భామ. ఈ విషయంపై శృతి మాట్లాడుతూ…సంగీతంలో వివిధ రకాల తరహాలను కలిపేసిన వ్యక్తి ఉద్యాన్ సాగర్. అలాంటి ప్రతిభావంతుడితో కలిసి ఆల్బమ్ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మరోసారి గాయనిగా మీ ముందుకు రావాలనుకున్న నా కోరిక నెరవేరుతోంది.
చాలా ఉద్వేగంగా ఉంది. అని చెప్పింది. మూడు భాషల చిత్రాలతో తీరకి లేకుండా గడిపాను. ఈ హడావుడిలో నన్ను నేను తెలుసుకోవడమే మర్చిపోయాను. నా గురించి ఆలోచించుకునే సమయమే దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా గురించి బయటవాళ్లు రకరకాల అభిప్రాయాలు చెప్పుకుంటున్నారు. కళాకారిణిగా ఒక స్థాయికి నేను సంతృప్తిపడలేను. నన్ను నేను నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవడం చాలా ముఖ్యమని భావిస్తా. ఈ ఏడాది గాయనిగా నేను పాడబోతున్న పాటలు వింటారు. అని గతంలో చెప్పింది శృతి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa