భారతదేశ ప్రజలు గర్వించదగ్గ మూవీ RRR. ఎస్. ఎస్ రాజమౌళి డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలకపాత్రలు పోషించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. డిజిటల్ రంగంలో కూడా RRR పెను సంచలనమే సృష్టించింది. లేటెస్ట్ గా బుల్లితెర ప్రీమియర్ కి కూడా సిద్ధమైంది.
తాజాగా RRR మూవీ టీంకు ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ "గూగుల్" ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. RRR మూవీని సెర్చ్ చేస్తే, గుర్రం, రాయల్ ఎన్ ఫీల్డ్ యానిమేషన్ బొమ్మలు వచ్చేలా గూగుల్ ఒక స్పెషల్ ప్రోగ్రాం ను డిజైన్ చేసింది. గూగుల్ ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ కు RRR మూవీ టీం కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో థాంక్యూ పోస్ట్ పెట్టింది.
RRR మూవీలో రామ్ అంటే రామ్ చరణ్ గుర్రాన్ని, భీమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ లను ఉపయోగించిన విషయం తెలిసిందే.