ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఒక సినిమాని చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అల్లూరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. శ్రీవిష్ణు ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అల్లూరి చిత్రాన్ని సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ఈరోజు ప్రకటించారు. ఈ రివర్టింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా నుండి మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని రివీల్ చేసారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.