"నిన్ను చూడాలని" సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్, రెండవ సినిమా "స్టూడెంట్ నెం.1" తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇదే డైరెక్టర్ రాజమౌళికి డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాను ch. అశ్వినీదత్ నిర్మించారు.
లేటెస్ట్ గా స్టూడెంట్ నెం.1 లో తారక్ కాదు నిజానికి ప్రభాస్ నటించవలసిందని నిర్మాత అశ్వినీదత్ గారు ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే పాపులర్ టాక్ షో "ఆలీతో సరదాగా" లో చెప్పారు. ఈ కథ తనవద్దకు వచ్చినప్పుడు ముందుగా హీరోగా ప్రభాస్ ను అనుకుంటుండగా, స్వర్గీయులు. నందమూరి హరికృష గారు ఫోన్ చేసి తారక్ ను ఫైనల్ చెయ్యమని కోరారట. దాంతో స్టూడెంట్ నెం. 1 గా తెలుగు ప్రేక్షకులకు తారక్ పరిచయమయ్యాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
![]() |
![]() |