సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం "వాంటెడ్ పండుగాడ్". 'పట్టుకుంటే కోటి' శీర్షిక. సాయిబాబా కోవెలమూడి, వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించడం విశేషం.
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఫుల్ టైం ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 14వ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరగనుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
![]() |
![]() |