నందమూరి కళ్యాణ్ రామ్ దాదాపు ఎనిమిదేళ్ల తరవాత అందుకున్న సాలిడ్ హిట్ "బింబిసార". చెప్పాలంటే, ఈ సినిమా కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్, మరియు హ్యూజ్ బడ్జెట్ తో నిర్మింపబడిన చిత్రం కూడాను. ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి, ఆపై నుండి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది.
లేటెస్ట్ గా బింబిసార మూవీని అబ్బాయ్ కళ్యాణ్ రామ్, బాబాయ్ బాలయ్యకు స్పెషల్ షో వేసినట్టు తెలుస్తుంది. ఈ స్పెషల్ షోకు డైరెక్టర్ వసిష్ఠ కూడా హాజరయ్యారు. సినిమా చూసిన బాలయ్య బింబిసార టీం మొత్తాన్ని మెచ్చుకున్నారట. ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేసారంట.
కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్లో సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ మూవీలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా, శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.