సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అడుగు పెట్టిన ప్రతి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజుకి ఎదిగింది లేట్ శ్రీదేవి. 1963లో మద్రాసులో జన్మించిన శ్రీదేవి పుట్టినరోజు ఈరోజు.
శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా అమ్మకు బర్త్ డే విషెస్ తెలుపుతూ జాన్వీ కపూర్, ఖుషి కపూర్లు ఇన్స్టాగ్రామ్ లో శ్రీదేవితో దిగిన ఫోటోలు పోస్ట్ చేసి ఆమెకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. జాన్వీ శ్రీదేవితో దిగిన చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేసి, రోజురోజుకూ నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను... ఐ లవ్ యు ముమ్మా ...అంటూ హార్ట్ మెల్టింగ్ కామెంట్ చేసింది.
ఫ్యామిలీ ఫంక్షన్ నిమిత్తం 2018లో దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే మరణించింది.