మత్తు వదలరా, సేనాపతి సినిమాలతో ఆకట్టుకునే నటనను కనబరిచిన యంగ్ యాక్టర్ నరేష్ అగస్త్య ఇటీవలే "హ్యాపీ బర్త్ డే" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
తాజాగా నరేష్ అగస్త్య హీరోగా "దిల్ వాలా" అనే ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. "పూలరంగడు" ఫేమ్ వీరభద్రం చౌదరి ఈ సినిమాకు దర్శకుడు కాగా, జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీం వర్క్ బ్యానర్ పై నబీషైక్, తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈరోజు పూజాకార్యక్రమాలలో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అల్లరి నరేష్, వి వి వినాయక్, ఆలీ హాజరయ్యారు. సెప్టెంబర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
![]() |
![]() |