బింబిసార లో ఆడియన్స్ కు స్పెషల్ సర్ప్రైజ్ గా దాచి ఉంచిన "గులేబకావళి" ఐటెం సాంగ్ లిరికల్ వెర్షన్ లో కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. చిరంతన్ భట్ స్వరపరిచిన ఈ పాటను చిన్మయీ శ్రీపాద ఆలపించగా, రామజోగయ్య శాస్త్రిగారు సాహిత్యమందించారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలన్నిటిలోకి బింబిసార చాలా స్పెషల్. ఎందుకంటే కొన్ని సినిమాలలో పాటలు బాగుంటాయి కానీ, మూవీ అంతగా నచ్చదు, మూవీ నచ్చితే పాటలు అంతగా ఆకట్టుకునే విధంగా ఉండవు. ఈ విధంగా చూసుకుంటే బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాక, మ్యూజిక్ ఆల్బం లోని ప్రతి పాట కూడా చార్ట్ బస్టరే.
కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.