లెజెండరీ టాలీవుడ్ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు వారసుడిగా, విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. రావడమే నంది అవార్డును కొట్టేసాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన "కలియుగ పాండవులు" మూవీతో వెంకటేష్ వెండితెరకు పరిచయమయ్యాడు. 1986 ఆగస్టు 14వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఖుష్బూ సుందర్ కి కూడా ఇదే తొలి తెలుగు సినిమా.
రేపటితో ఈ సినిమా విడుదలై 36 ఏళ్ళు... అంటే వెంకటేష్ సినీ ఇండస్ట్రీ ఇచ్చి 36 ఏళ్ళు పూర్తి కావొస్తుంది. దీంతో ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియాలో 36ఇయర్స్ ఆఫ్ విక్టరీ వెంకటేష్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.