"బిచ్చగాడు" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంథోనీ. 2016లో విడుదలైన ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత నుండి విజయ్ నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తుంది. కానీ, బిచ్చగాడు స్థాయి హిట్ మాత్రం విజయ్ అందుకోలేకపోతున్నాడు.
తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం "హత్య". ఈ మూవీ ట్రైలర్ ఆగస్టు 15వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు బాలాజీ కుమార్ డైరెక్టర్ కాగా, "గురు"ఫేమ్ రితిక సింగ్ హీరోయిన్. మీనాక్షి చౌదరి కీరోల్ లో నటిస్తుంది. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.