తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు రష్మిక మందన్న. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ గా గుర్తింపు పొందటానికి తాను పడిన కష్టాల గురించి చెప్పింది. హీరోయిన్ అవ్వటానికి ఎంతో ఓర్పు, పట్టుదల, సహనం ఉండాలని, హీరోయిన్ అవ్వటానికి ఒక్క రాత్రి సరిపోదు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. స్టార్ స్థాయికి చేరుకోవడానికి ఏడేళ్లు కష్టపడ్డానని తెలిపింది.