టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో నాగ్ ఒక పొడవాటి కత్తిని పట్టుకుని ఫైట్ చేస్తుంటాడు. ఆ కత్తిని చూపిస్తూ, "తమహాగానే" అనే పదం యొక్క అర్ధాన్ని ఆగస్టు 18వ తేదీన ఉదయం 10:08 గంటలకు రివీల్ చేస్తామని చెప్పిన మేకర్స్ లేటెస్ట్ గా తమహాగానే గ్లిమ్స్ ను విడుదల చేసారు. ఒక సీక్రెట్ పెట్టె దానిపై అర్ధం కానీ భాషలో రాసి ఉన్న ఈక్వేషన్ ... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కలిపిన, ఈ గ్లిమ్స్ తమహాగానే అంటే ఏంటో తెలుసుకోవాలన్న ఇంటరెస్ట్ ను ఆడియన్స్ లో కలిగించాయి.