టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి రాబోతున్నాడు. కార్తీక్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ మణి శర్మ కంపోస్ చేసిన ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'నచ్చవ్ అబ్బాయి'ని విడుదల చేసారు. ఈ పాటను ధనుంజయ్ సీపాన మరియు లిప్సిక పాడారు. ఈ సాంగ్ కి భాను కొరియోగ్రఫీ అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.