కమెడియన్ సునీల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "బుజ్జీ ఇలారా". ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు 27వ తేదికి వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి కథను అందించగా, గరుడవేగ అంజి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. SNS క్రియేషన్స్ బ్యానర్ పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సునీల్, ధనరాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణ మురళి, జబర్దస్త్ వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.