బాలీవుడ్ లో సౌత్ సినిమాల హవా మొదలైంది. అల్లు అర్జున్ పుష్ప, యశ్ కేజీఎఫ్ 2, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ ఆర్ఆర్ వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి. బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలకు ధీటుగా అద్భుతమైన కలెక్షన్స్ సాధించాయి. టాలీవుడ్ సాధిస్తున్న విజయాలపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కా రాల్ని అన్వేషించడంలో టాలీవుడ్ ముందంజలో ఉంది.. టాలీవుడ్ ను ఆదర్శంగా తీసుకొని బాలీవుడ్ కూడా సమస్యల పరిష్కారా నికి నడుం బిగించాలని అక్షయ్ అభిప్రాయపడ్డారు. ఇక రాఖీ పండగ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్ 'రక్షాబం ధన్' పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.