తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలో నటిస్తున్న “కమిట్మెంట్" సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజస్వి సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో అవకాశాల కోసం మేనేజర్లను కలిసినప్పుడు వారి మాటలు షాక్ కు గురి చేశాయని చెప్పింది. వాటికి ఎలా రియాక్ట్ కావాలో అర్థమయ్యేది కాదు. వయసు, అనుభవం వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోని రియాలిటీ ఏమిటో అర్థమైంది. అలాంటి సంఘటనలను 'కమిట్మెంట్' సినిమాలో చూపించబో తున్నట్లు తేజస్వి తెలిపింది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించారు.